Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?

Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?  

 

తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణాభారం రామకృష్ణుడి మీదపడేంది. అతని కష్టాలు ఎక్కువయ్యాయి. ఐతే అప్పటికే అతను తన హాస్యకవితా కౌశలంతో పండితులనీ, భట్రాజులనీ ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు.

ఆంధ్రభోజుడని పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం చేరగలిగితే తన సమస్యలు తీరిపోతాయని – వారి రాజధాని హంపీ విజయనగరం చేరి – రాయలవారి వద్ద తాతాచార్యులకు పలుకుబడి ఉందని విని,

“నా కెట్లయినను రాయలవారి దర్శనము కలిగించండి-” అని వారిని బతిమాలాడు. వయోవృ్ద్ధుడయిననూ.. తిరుమల తాతాచార్యులతని కేమియు సహాయము చేయక, స్పష్టంగా చెప్పక “రేపు రా మాపు రా” అంటూ కాలయాపన చేశారు. ఈ తిరుగుళ్లతోనూ రేపు, మాపులతోనూ రామకృష్ణుడి ప్రాణం అంతా విసిగిపోయింది. చివరికి అల్లసాని పెద్దన్న సాయంతో అతను రాజాశ్రయం సంపాదించగలిగాడు. ఆ రోజులలోనూ ప్రతిభకి సిఫార్సు ఉండవలసిందే. అధికారుల, ప్రభువుల దర్శనానికి ఎందరో దళారీలే!

రామకృష్ణుడికి తాతాచార్యుల మీద మనసులో కోపం ఉండిపోయింది. రామకృష్ణుడి మీద తాతాచార్యులకీ అసూయే. (రాయలు అతని హాస్యాన్నీ కవిత్వాన్నీ తెగమెచ్చుకుంటాడని)

చాలాకాలం అనంతరం…..

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

ఆవేళ… నట్టింటిలో… ఉయ్యాల బల్లమీద కూర్చున్న తిరుమల తాతాచార్యులు- వీధిలోపోతున్న రామకృష్ణుడి కంటపడ్డాడు. అంతే. అతను తాంబూలం వేసుకుని – వచ్చి -“తాతా!” అని పిలిచాడు. తాతా అనేది అతని పేరులో భాగం… అతను పెద్దవాడుకూడా. “ఏమిటి?” అడిగాడు తాతాచార్యులు ఒక వైపు సందేహిస్తూనే. “ఊయల కదలుట లేదు..” “ఊపుటకు శిష్యులు లేరు. భోజనాలకి వెళ్ళారు చిరాగ్గా ఉంది”.

“ఓహో! తాతా! ఊతునా?” ఎంతో వినయంగా అడిగాడు రామకృష్ణుడు. తాతాచార్యులు పొంగిపోయారు. తల బిరుసుకు పేరుపడిన రామకృష్ణుడే – ‘సేవకుడివలె ఊయలూపుతానంటున్నాడు! ఎంత గౌరవం తనకి!

“ఊం” అన్నాడు సంతోషంగానూ గర్వంగానూ.

అంతే క్షణం ఆలస్యం చెయ్యకుండా…. రామకృష్ణుడు తననోటిలోని తాంబూలమూ,. దాని రసమూ, లాలాజలమూ అన్నీ కలిపి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు.

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

అవమానమూ, కోపమూ భరించలేక ఛర్రున అంతెత్తున ఎగిరాడు తాత- అనూహ్యమయిన ఆ సంఘటనకి. “రామలింగా! నీకు బుద్ధిలేదా? ఒళ్లు కొవ్వెక్కినదా? నీ దుశ్చర్యని రాయలవారికి చెప్పి “శిక్షించకపోతే…” “నేనేం చేశానని? తాతా! ఊతునా? అని అడిగాను. మీరు అంతే అని అంగీకారం తెలిపారు. ఓహో! అర్ధమయింది. ఊతునా అంటే ఉమ్మేదా? అన్న భావంలో నేనడిగితే ఊయలూపడం

అనే అర్ధం తమరు తీసుకున్నారు కాబోలు. ఒకే పదానికి అనేక అర్థాలుండడంవలన జరిగిన  పొరపాటిది. శిక్షించవలసివస్తే పదాలను శిక్షించాలి అనేక అర్ధాలతో ఉండి అనర్థాలకి దారి తీస్తున్నందుకు. రాయలవారికి చెప్పండి తమరు. నేనూ చెబుతాను-” అని జారుకున్నాడు రామకృష్ణుడు. అంతటితో అతనిలో తాతాచార్యుల పట్ల ప్రతీకారవాంఛ సమసిపోయింది. తాతాచార్యులకు గర్వభంగమయింది.

Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ

 


Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం


Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు