Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని – అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు,
అది – కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని తన సేనానాయకుడు పసరము గోవిందరాజని పిలిపించి- “రాయలను పట్టి బంధించి తే” అంటూ చాలా సైన్యాన్నిచ్చి పంపాడు. రాయలవారిసైన్యం చాలా తక్కువ.
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
అయినా కొంతసేపు శత్రుసైనికులతో పోరాడి చివరకు వెనక్కితగ్గారు, కాని కృష్ణదేవరాయలొక్కడే వందలాదిగా శత్రుసైనికులు చుట్టుముడుతున్నా నిర్భయంగా వారితో పోరాడసాగాడు.
అతని పరాక్రమధాటికాగలేక శత్రుసైనికులు చెల్లాచెదరైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు.
ఐతే ఆ యుద్ధంలో రాయలవారు జయం పొందడం అసాధ్యమని ఆయనవెంట వెళ్లిన వండితులు భావించారు… తమరాజునెలా కాపాడుకోవడమా అని వాళ్లాలోచించసాగారు. యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. అప్పుడు రామకృష్ణకవి పసరము గోవిందరాజుకి వినపడేలా యీ పద్యం చదివాడు.
“ బసవనకు పుట్టినప్పుడే
పసరము గోవిందరాజు పసరంబయనన్
కసవేటికి తినడనగా
కసవొందెను శత్రులాజి గదసిన వేళన్
(భావం: పశువుకి పుట్టిన పసరము గోవిందరాజు పశువయినా గడ్జెందుకు తినడం లేదంటే-అతను యుద్దంలో శత్రువుల చేతిలో మరణించాడు కనుక.) ఇది. తిట్టుకవిత్వం-శాపం కూడా రామకృష్ణుని వాక్కు అమోఘమయినది.
Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
(వ్యర్ధం కానిది) అందుచేత ఆపద్యం వింటూనే గోవిందరాజు రక్తం కక్కుకుంటూ కిందపడి మరణించాడు. అతని సైనికులు పారిపోయారు.
పెద్దన మొదలయిన కవులు రామకృష్ణకవీ! మీశక్తి సామర్భాలనింతవరకూ. తెలుసుకోలేకపోయాను. అనుకోకుండా సంభవించిన పెద్ద విపత్తునుండి నన్ను మీరు రక్షించారు.
నాగౌరవ ప్రతిష్టలు నిలబెట్టారు. మీకు నాకృతజ్ఞతలు. మీకేం వరంకావాలో కోరుకోండి ఇస్తాను-” అన్నాడు. అప్పుడు – “మహాప్రభూ! కవులమయిన మేము మీ ప్రజలమే మా రాజయిన మిమ్మల్ని కాపాడుకోడం మా బాధ్యత మీ అనుగ్రహముంటే అంతేచాలు” అన్నాడు రామకృష్ణుడు వినయంగా.
మీరు నన్ను రక్షించారు. అందువలన మీకేదయినా మేలుచేయాలని, నేను దృఢంగా సంకల్పించుకున్నాను. కనక మీకు కావలసినవి కోరుకోండి.” అన్నారు రాయలు.
రామకృష్ణుడు చేతులు జోడించి “మహారాజా! మీదయవలన నేనూ నాకుటుంబమూ ఎంతో సుఖంగా ఉంటున్నాం. ఐతే నేనప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాను అవి మీకు తప్పు పనులుగా తోచవచ్చును.
కనుక నేను రోజుకి నూరు తప్పులు చేసినా తమరు నన్ను దండించక క్షమించాలి. ఈవరమొక్కటి చాలు నాకు” అని ప్రార్థించాడు. రాయలు మందహాసంతో- “కవీంద్రా! మీరుకోరినట్లే రోజుకి నూరు తప్పులు చేసినా మిమ్మల్ని దండించను.
తప్పకుండా క్షమిస్తాను” అని వాగ్దానం చేశారు. అప్పుడందరూ తమ రాజధానికి ప్రయాణం కట్టారు.
Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు
Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ