Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu

* మతం సమ్మతం కాదు *

తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు.

రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు.

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు

నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే.

తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు-

“రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభావముందని ప్రజలు గ్రహించి వారిని దూషిస్తునట్లు తెలిసింది వారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కొందరు అధికారులు కూడా నాకు మనవి చేశారు. ఆయన మా కులగురువు కనుక నేనేమనడానికీ వీలుండదు. కాబట్టి ఆయన ఛాందసబుద్ధిని పోగొట్టడానికి మీరే ఏదైనా ఉపాయం చూడండి” అలాటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న రామకృష్ణుడు “తమ ఆజ్ఞ ప్రకారమే తాతాచార్యులవారి ప్రవర్తనలో మంచిమార్చుతేవడానికి ప్రయత్నిస్తాను” అని రాయలవారికి చెప్పి వెళ్ళాడు.

రాయల మాటలతనికి కొండంత బలమిచ్చాయి. మర్నాడే అతను తాతాచార్యుల ఇంటికి వెళ్లాడు అతన్ని చూస్తూనే అయన తన ఉత్తరీయంతో ముఖం కప్పేసుకున్నారు.

Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి

“గురుదేవా! నేను తమ శిష్యవర్గంలోని వాడినే కదా? నన్ను చూచి ఉత్తరీయంతో ముఖం కప్పేసుకున్నార్రేం?” అమాయకంగా అడిగాడు రామలింగడు. “రామకృష్ణా! నువ్వు నాకు ప్రియశిష్యుడివి ‘కనుక రహస్యం చెబుతున్నాను విను. స్మార్తమతము మహా పాపభూయిష్టమయినది.

స్మార్తుని చూసినవారు మరు జన్మలో గాడిదలుగా పుడతారు. అందుకు నేను స్మార్తుదెదురైతే ముఖానికి ఉత్తరీయం కప్పుకుంటాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు” అన్నారాయన.

రామకృష్ణుడు ఆచార్యుల వారివద్దశలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పదిరోజులుగడిచాక ఒకరోజు రాయలవారు కవులు పండితులు మంత్రులు మొదలయిన వారితో ఊరిబయటనున్న ఉద్యానవనానికి వెళ్లారు.

కొంతసేపక్కడ గడిపివస్తూండగా తోవలో వారికి ఒక గాడిదల గుంపు ఎదురయింది. ఆ గాడిదల గుంపుని చూసీ చూడడంతోనే రామలింగడు పరుగు పరుగున పోయి వాటికి సాష్టాంగ నమస్కారాలు చేయసాగాడు. అతని చేష్టలకి రాయలవారితో సహా అందరూ పకపక నవ్వారు. రాయలవారు “ రామకృష్ణకవీ! మీకు మతికాని చెడిందా? గాడిదలకి నమస్కరిస్తున్నారేమిటి?” అని అడిగారు.

అదివిన్న రామకృష్ణుడొకసారి తాతాచార్యులవారివైపు చూసి అంతలోనే రాయలవేపు తిరిగి “రాజేంద్రా! నామతి చెడలేదు ఈ గాడిద మన తాతాచార్యులగారి తాత. ఇది వారి బావమరిది. ఆపక్క నున్నది తాతాచార్యులవారి మేనమామ. ముఖంమీద నల్లమచ్చుందే ఆ గాడిద మన ఆచార్యులవారి తండ్రి.

పూర్వజన్మలో వీళ్ళు స్మార్తుల ముఖంచూడడంవలన యీజన్మయందిలా గాడిదలై పుట్టారు. మహానుభావులను దర్శించుట వల్ల నా జన్మపావనమయింది. నాపాపం పటాపంచలయింది. నామాటలబడ్దాలనుకోకండి “ఒకసారాగి తాతాచార్యుల వైపు చూసి “వచ్చే జన్మలో తమకిలాటి దుస్థితి సంభవించకుండా ఉండేందుకే పూజనీయులయిన మన తాతాచార్యులవారు స్మార్తులు కనబడితే గాడిద జన్మకలుగుతుందని ముఖానికి ఉత్తరీయం కప్పకుంటున్నారు. కావాలంటే యీ, విషయం వారినడిగి తెలుసుకోవచ్చు- అన్నాడు.

ఆమాటలకు తాతాచార్యులవారు సిగ్గుతో తలవంచుకున్నారు. ఆనాటినుంచీ ఆయన ముఖాన్ని ఉత్తరీయంతో కప్పుకునే అలవాటుకి స్వస్తి చెప్పారు. రామకృష్ణుడి చమత్మారానికి అందరూ ఆనందించారు. రాయలవారు. రామకృష్ణుడికి రహస్యంగా బహుమతులందించారు.

Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు


Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక


Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu