silver lights pooja with devotional వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు

వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు

వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.
silver lights pooja with devotional వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు

1. శ్రీ మహాగణపతి – అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు – శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు – తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు – రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు – బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు – ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు – మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని – కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు – సంపదలు కలుగుతాయి.
10. కేతువు – మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి – జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ – దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి – శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి – పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి – సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు – దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు – జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు – అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు – సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు – మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు…
1. మేషరాశి – త్రివత్తులు (3)
2. వృషభరాశి – చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి – సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి – త్రివత్తులు (3)
5. సింహరాశి – పంచమవత్తులు (5)
6. కన్యరాశి – చతుర్‌వత్తులు (4)
7. తులారాశి – షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి – పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి – త్రివత్తులు (3)
10. మకరరాశి – సప్తమవత్తులు (7)
11. కుంభరాశి – చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి – పంచమవత్తులు (5)

జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు…
1. మేష లగ్నం – పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం – సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం – పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం – త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం – సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం – ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం – పంచమవత్తులు (5)
10. మకర లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం – ద్వివత్తులు (2)

May 18, 2016 8:09 PM

48 total views, 0 today