Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు

Tenali Ramakrishna Stories in Telugu ,గూని మందు   మంత్రులు సేనాధిపతులు మొదలయిన ముఖ్యులతో కూర్చుని -శత్రురాజులమీద దండెత్తే విషయంలో రహస్యఆలోచనలు చేస్తున్నారు కృష్ణదేవరాయలు. వారి అనుమతి తీసుకోకుండాఅక్కడికి ప్రవేశించాడు రామలింగడు. వెళ్ళి ఊరుకోకుండా పరిహాసం ఆడబోయాడు. అతిముఖ్యమయిన విషయం మాట్లాడుతూండగా రావడం; వచ్చి పరిహాస ప్రసంగం చేయబోవడం - రాయలకి పట్టలేని కోపం తెప్పించింది. “సమయమూ సందర్భమూ. లేకుండా .... పిలవని పేరంటానికి వచ్చి....పరిహాస ప్రసంగం చేయబోయిన యితన్ని తీసుకుపోయి గొయ్యితవ్వి కంఠం వరకూ పాతిపెట్టి ఒకరోజుంచి మర్నాడు ఏనుగుతో తొక్కించండి అని భటులనాజ్ఞాపించాడు. రామకృష్ణుడికి రాయలటువంటి కఠినమయిన శిక్షవిధించడం అక్కడివారందరికీ బాధకలిగించింది, కాని చాలా కోపంగా ఉన్న రాయలవారికీ సమయంలో నచ్చజెప్పి అతన్ని కాపాడడానికెవరికీ సాహసం. చాలక పోయింది. రాజాజ్జను జవదాటలేక భటులు రామకృష్ణుని ఊరిచివరకు తీసుకుపోయి- గొయ్యి తవ్వి కంఠమువరకూ మట్టికప్పి వెళ్లిపోయారు. ఏనుగుచేత తొక్కించడం మర్నాడు కదా. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Tenali Ramakrishna Stories in Telugu, నల…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, నల్ల కుక్క తెల్ల అవు

Tenali Ramakrishna Stories in Telugu, నల్ల కుక్క తెల్ల అవు    శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాక తన పనిలో చాలా నిపుణుడు కలవాడు కూడా. అతను సదాచార పరాయణుడు. క్షరకుడయినా నిరంతర నిష్టాగరిష్టుడూ, దైవభక్తి పరాయణుడూ.అతని విశ్వాసమునకూ శీలమునకూ చాలా సంతోషించిన రాయల వారొకనాడు - “మంత్రీ! నీకేంకావాలో కోరుకో” అన్నారు. (మంగలిని మంత్రి అని కూడా అంటారు గౌరవంగా) అప్పుడతను చేతులు జోడించి -ప్రభూ! తమరికి తెలియనిదేమున్నది? నేను చిన్నప్పటినుంచీ నిష్టానియమాలు పాటిస్తూ వచ్చినవాడిని. ఎలాగయినా నన్ను బ్రాహ్మణునిగా చేయించండి, చాలు. నాకు బంగారంమీదా డబ్బుమీదా ఆశాలేదు, కోరికాలేదు - బ్రాహ్మణ్యం మీద తప్ప” అని విన్నవించుకున్నాడు. తీవ్రమయిన కోరిక ప్రభావంలో అతను యుక్తాయుక్తాలు మరచి అటువంటి గడ్డుకోరిక కోరగా - కవీ, పండితుడూ అయిన రాజు కూడా -క్షవర కళ్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరచి కాబోలు, సాధ్యాసాధ్యాలను మరచి ” “సరే అలాగే” అనేశారు. రాజపురోహితులకు కబురు వెళ్లింది. వారు వచ్చారు. “ఈ క్షురకుని బ్రాహ్మణునిగా చేయండి” ఆజ్ఞాపించారు రాయలు. అది అసాధ్యమని వారికి …
Read more about Tenali Ramakrishna Stories in Telugu, నల్ల కుక్క తెల్ల అవు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రాయడం మాటలు కాదు

 రాయడం మాటలు కాదు Tenali Ramakrishna Stories in Telugu   ఒకసారి రాయలవారి ఆస్థానానికొక పండితుడు వచ్చి “ఎవరెంత తొందరగా పద్యము చెప్పినను నేను గంటము (కలము) ఆపకుండ ఆక్షణమునే రాసెదను” అని సవాలు చేశాడు. రామలింగడు లేచి - పండితవరేణ్యా! నేనొక పద్యం చదివెదను. దానిని - నేను చెప్పినంత వేగముగానూ వ్రాసెదరా?” అని అడిగాడు. “ఓ” అని నవ్వేశాడు పండితుడు గంటనూ, తాటియాకులూ (తాళపత్రాలు) తీస్తూ..... రామలింగడు చదివాడు. Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి  తవ్వటబాబా తలపై పువ్వుట జాబిల్లి వల్వ బూదిట చేదే బువ్వట....” అంటూ రామలింగడు చదివేసరికి - పండితుడికి గంటం కదలలేదు.   (నిజానికీ పద్యం చదివేటప్పుడు వింతధ్వనులతోనూ విచిత్ర శబ్బాలతోనూ రాతలోకి యిమడకుండా అస్పష్టంగా ఉంటుంది. అందుకే - ఆ పండితుడు - మొదటి పదాన్ని రామలింగడు పలికిన తీరుకే తెల్లబోయి - వెర్రి మొహం వేసేశాడు.)   తన ఓటమినంగీకరించి తోకముడిచేశాడా పండితుడు.   (పై పద్యానికి తాత్పర్యం : తలమీద పువ్వు చందమామ. బట్టలు - బూడిద. ఆహారం చేదు (గరళం). ఇల్లు శృశానం. అట్టి శివునకు నమస్కారములు) Tenali Ramakrishna Storie…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రాయడం మాటలు కాదు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, తాతాచార్యుల వారిని పరాభవించుట

 తాతాచార్యుల వారిని పరాభవించుట *   శ్రీకృష్ణదేవరాయలు గురువు తాతాచార్యులవారు. రాయలు గురువుగారిని అత్యంత గౌరవముగా చూసెడివారు. తాతాచార్యులవారు శ్రీవైష్ణవులవటంవల్ల ఆయన ఆస్థానములో స్మార్తులందరిని చిన్నచూపుతో చూచెడివాడు. రామలింగడు కూడా మరి స్మార్తుడే. ఎలాగైనా తాతాచార్యుల వారిని అవమానించాలని స్మార్తులందరూ కలసి రామలింగని శరణుజొచ్చారు. ఒక రోజు రామలింగడు, తాతాచార్యుల వద్దకేగి “తాతా! నా ఎడమ చెయ్యి బొటనవ్రేలికి పొరబాటున గోమయము (పేడ) అంటుకొనినది. దానికి ప్రాయశ్చిత్తమేమిటి”అని యడిగెను. “నియమ నిష్టలతో నుండే సదాచార సంపన్న పండితులు యిలాంటి ఉపద్రవమొచ్చినపుడు ఎంతవరకూ గోమయమైనదో అంత భాగమును ఖండించవలెనని శాస్త్రము ఘోషించుచున్న”దనెను.   Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి    రామలింగడు బొటనవ్రేలికి కట్టుతో రాజసభకు ప్రవేశించాడు. ఆ విషయం అంతటితో అందరునూ మరిచారు. తాతాచార్యుల వార్కి తోటకూర యున్న మిక్కిలి ప్రీతి. రామలింగడు తన తోటలో పీకల లోతు గోయిత్రవ్వి పేడతో నింపి పైన తోటకూర చెట్లనునాటింపగా అది తోటకూర పంటవలె కన్పించునటుల చేశాడు. మరునాడు ఏదో నెపముతో కవులందరినీ తన…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, తాతాచార్యుల వారిని పరాభవించుట
  • 0

Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం

Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం   ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు రామలింగడి తెలివిని పరీక్షించాలనె ఆలోచన పుట్టింది. అనుకున్న విధంగానే రామలింగడి తెలివికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా రామలింగడికి ఇస్తాడు. ఆ గంప నిండా నాణాలు ఉండడంతో ఆ గంప చాలా బరువుగా ఉంటుంది, ఏ మాత్రం కుదుపు వచ్చినా గంప లో ఉన్న నాణలు అన్నీ కింద పడిపోతాయి, ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా ఉంటుంది ఆ గంప. దాంతో మిగిలిన సభికులు అంతా రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించసాగుతారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా ఆ గంప లేవదు. ఇలా రామలింగడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన తలకి ఉన్న తలపాగాను తీసి నేలపై పరిచి అందులో కొన్ని నాణాలను తలపాగాలో పోసి మూటగట్టుకుంటాడు, కొన్ని నాణాలను తన జేబులో నింపుకొని, మూటగట్టుకున్న నాణేలను బుజాన వేసుకుని, వెలితి పడిన గంప నెత్తిన పెట్టుకొని నడవడం మొదలు పెడతాడు. రామలింగనీ సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు” శభాష్ రామలింగా! శబాష్!” అంటూ మెచ్చుకొంటాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరిస్తూ ఉండగా ….బరువు కి అతన…
Read more about Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం
  • 0

Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 

పాలు త్రాగని పిల్లి (Tenali Ramakrishna stories in Telugu)   విజయనగర సామ్రాజ్యంలో నివాసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక గడ్డు సమస్య వచ్చిపడింది. నగరంలో ఎలుకల బెడద ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఎలుకలు ఇండ్లలోని ఆహారపదార్ధలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేయసాగినవి.ఈ సమస్య నుంచి ఎలా అయిన బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరంలోని ప్రజలకు పిల్లులను పెంచమని చెప్పింది. రాయల వారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పెను. పిల్లులను పెంచదానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇచ్చెను. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికి ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవును పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను.   అలా ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక్క పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగించెను. Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు రామకృష్ణుడు పిల్లికి సరిగా పాలు త్రాగించక, తిండి పెట్టక, ఆవు ఇచ్చిన పాలను తమ కుటుంబ అవసరాలకు వి…
Read more about Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 
  • 0

Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు

Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు   ఒకనాడు ఆనందభట్టు అనే కవిపండితుడొకడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు వచ్చి “ప్రభూ! తిట్టుకవిత్వం చెప్పుటలో నాతో సరితూగగలవారి నెవ్వరినీ నేనెక్కడా యింతవరకూ జూడలేదు. మీరంగీకరించినచో మీ ఆస్థానమున నా కవిత్వమును ప్రదర్శించవలెనని మిక్కిలి కోరికగానున్నద”నెను. రాయలవారికి ఆ కవిత్వముపట్ల ఆసక్తి లేకపోవుటచే అంగీకరింపక కవిగార్ని సభకురానీయకుండ ఊరకపంపుట కిష్టపడక తగిన బహుమానముల నిచ్చి పంపివేయుట మంచిదని తలచెను. ఊరక బహుమానము స్వీకరించుటకు ఆనందభట్టుకు యిష్టంలేక రాయలవద్ద ఈ క్రింది పద్యాన్ని చదివాడు. ఊ॥ బూతుకవిత్వ వైఖరుల ప్రౌఢధము జూడల్‌ పొమ్మనంగ నీ కేతగుగాక. యిటుల మరెవ్వరు చెప్పుదురో నృపోత్తమా చాతురితో తెనాలి కవిసత్తముడీతడు రామకృష్ణుడీ రీతిని యూరకుండిన విరించినైనను జయింపజాలునే మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   రాయలవారి యనుజ్ఞలేనిదే మాట్లాడుట మర్యాదగాదని అప్పటివరకూ యూరకుండిన రామలింగడు దిగ్గునలేచి, ఈ క్రింది పద్యపాదమునిచ్చి ఆనందభట్టును పూరింపమన్నాడు. “చూతు వెలుపుడాయటంచు సూక్తులు పలిక…
Read more about Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు
  • 0