Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

తెనాలి రామకృష్ణుడి పరిచయం  - Tenali Ramakrishna Introduction   తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు. వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమయిన కవి. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి ఎందుకంటే రామకృష్ణుడు "పాండురంగ మాహాత్యం”వంటి కొన్ని భక్తిగంథాలు రాసినా, ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే - చాలా మంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమోకాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు. వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు, నేటి భాషలో తెనాలి రామలింగనివి “ప్రాక్టికల్‌ జోక్స్‌” అన్నమాట. అందుకే అతనికి “వికటకవి” అని మరో మారు పేరు. ఈ మాటని ఎటునుంచి చదివి…
Read more about Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం

రామకృష్ణుని బాల్యం * Tenali Ramakrishna Stories in Telugu    విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం తో చనిపోతాడు, తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడు కి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో నా అనువారు ఎవరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుని తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు. తండ్రి లేని పిల్ల వాడు అవడం వల్ల రామ కృష్ణుడిని అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాబంగా మరియు అల్లారుముద్దుగా పెంచుతారు, దాంతో రామకృష్ణుడు చదువు అటకెక్కుతుంది. అతను క్రమేపి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ఆరంబిస్తాడు. Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. రామకృష్ణుడు చె…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu * మతం సమ్మతం కాదు * తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు. Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే. తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు- “రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభావముందని ప్రజలు గ్రహి…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం

Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం   ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని - అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు, అది - కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని తన సేనానాయకుడు పసరము గోవిందరాజని పిలిపించి- “రాయలను పట్టి బంధించి తే” అంటూ చాలా సైన్యాన్నిచ్చి పంపాడు. రాయలవారిసైన్యం చాలా తక్కువ. Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ అయినా కొంతసేపు శత్రుసైనికులతో పోరాడి చివరకు వెనక్కితగ్గారు, కాని కృష్ణదేవరాయలొక్కడే వందలాదిగా శత్రుసైనికులు చుట్టుముడుతున్నా నిర్భయంగా వారితో పోరాడసాగాడు. అతని పరాక్రమధాటికాగలేక శత్రుసైనికులు చెల్లాచెదరైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు. ఐతే ఆ య…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం

రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu   రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు. అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి. రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకెళ్లి చూపిస్…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం   శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే  స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది. “పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె గర్వం మరీపెరిగిపోయింది. ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది. “ఆమె గర్వం అణచాలి పండితుల గౌరవం కాపాడాలి” అని నిశ్చయించుకుని- ఒకనాడు సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డిమోపు పెట్టుకుని - ఆమె యింటిముందు “గడ్డిమోపండీ..గడ్డిమోపు-” అని అరవసాగాడు. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి శ్రీవాణి యింట్లో కొన్ని ఆవులుండేవి. అందుచేత ఆమెతరచుగా పచ్చ గడ్డి కొనేది. అది తెలుసుకునే రామలింగడు అలా వేషమేసుకుని అరవసాగాడు. ఆమెకతని కేకలు విని మేడదిగి కిందకొచ్చి "ఏమయ్యా గడ్డిమోపెంతకిస్తావ్?" అని అడిగింది. తన పాచిక పారుతూందని మనసులో సంతోషపడుతూ “పట్టెడు మెతుకులుపెడితే గడ్డిమోపిస్త…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు   శ్రీకృష్ణదేవరాయలవారు నివసించే రాజభవనానికి తిమ్మన అనే కావలివాడుండేవాడు. అతను చాల ధైర్యసాహసాలు కలవాడు తిమ్మన సేవలను మెచ్చుకుంటూ రాయలవారతనికొకనాడు, అందమయిన -ఖరీదయిన శాలువని బహుకరించారు. తిమ్మనకి కవులన్నా కవిత్వమన్నా ఎంతో గౌరవం. బహుమతిగా పొందిన శాలువను భుజంమీద కప్పుకుని అతను వస్తూంటే, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, తెనాలి రామకృష్ణుడు కలిసివస్తూ ఎదురయ్యారు. అతను బహుమతి పొందినందుకు తమసంతోషాన్ని చెప్పడానికి వారు నలుగురూ ఒక్కొక్క పాదం చొప్పున దిగువ విధంగా కందపద్యం చెప్పారు. Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి  పెద్దన  - “వాకిల కావలి తిమ్మా” ముక్కుతిమ్మన -  “ప్రాకటముగ సుకవి వరుల పాలిటి సొమ్మా” భట్టుమూర్తి  -  “నీకిదే పద్దెము కొమ్మా” (మరి రామకృష్ణుడు ఏంచెప్పినా అతని ప్రత్యేకత కనిపిస్తూంది కదా!) రామకృష్ణుడు - “నాకీ పచ్చడమేచాలు నయముగ నిమ్మా” అని పద్యాన్ని పూర్తి చేశా…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ

  Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ   రాయలవారి తల్లి వృద్ధురాలు. జబ్బు చేసి - అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి “నాయనా! నేనిక ఎన్నోరోజులు బతకను. బాగా పండిన మామిడి పళ్లను తినాలని నా చివరి కోరిక.” అంది. ఏర్పాటు చేయమన్నట్లు. తల్లి కోరిక తీర్చాలని - “ఎంత దూరమయినా వెళ్లి, ఎంత ఖర్చయినా సరే - మామిడి పళ్లు ఎలాగేనా తీసుకురండి” అని భటులని నాలుగు వేపులుగా పంపాడు రాయలు. కాని... అది మామిడి పళ్ల కాలం కాదు. భటులు చచ్చీ చెడీ ఎలాగో ఎక్కడి నుంచో పునాసకాపు మామిడి పళ్లను తెచ్చేలోగానే మామిడి పళ్లు... మామిడి పళ్లు...” అంటూ పలవరిస్తూ వృద్ధురాలు ప్రాణం విడిచేసింది. తల్లి కోరికను తీర్చలేనందుకు విచారిస్తూ రాచకార్యాలను చూడడం కూడా మానేసిన రాయలు వద్దకు తాతాచార్యులు వెళ్లి ... “మీ తల్లిగారి అంతిమ కోర్కెను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనో వేదన నేనర్ధం చేసుకోగలను. దీనికొక ఉపాయముంది-” అన్నాడు. “ఏమిటి?” ఆత్రంగా అడిగాడు రాజు. “తల్లిగారికి ఉత్తరక్రియలు (పెద్దదినం) జరిపే రోజున బంగారు మామిడి పళ్లను బ్రాహ్మణులకు దానమిస్తే - పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీరి తృప్తి చె…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి

Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి   శ్రీకృష్ణదేవరాయలు కర్నాటక దేశాన్ని పాలించే కాలంలో ఉత్తర హిందూ దేశాన్నంతటినీ మహమ్మదీయులు పరిపాలించేవారు. ఆనాటి ఢిల్లీ పాదుషా ఎంతో ధనము ఖర్చు చేసి ఒక బావిని తవ్వించాడు. అది చాలా అందంగా నిర్మించబడింది. హిందువులు - దేవాలయం కట్టించినా నూతిని తవ్వించినా ప్రతిష్ట అనే కార్యక్రమం జరుపుతారు. ఐతే - ఢిల్లీపాదుషా తాను అత్యంత సుందరంగా నిర్మించిన బావికి పెళ్లిచేయాలని తలపెట్టాడు. ముహూర్తం పెట్టించి - తమ సామంత రాజులందరికీ యిలా ఆహ్వానాలు పంపాడు. “మేము నిర్మించిన ఈ దిగుడుబావికి పెండ్లి చేయుచున్నాము. కనుక మీ దేశములోని బావులన్నిటినీ ఆ పెండ్లికి పంపించండి”. ఆ ఆహ్వాన లేఖనందుకున్న రాయలుకి ఆశ్చర్యంతో మతిపోయింది. అక్కడ బావికి పెండ్లి! ఇక్కడ నుంచి బావులు వెళ్లడం - ఏమిటిది? ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. ఢిల్లీ పాదుషానుంచి వచ్చింది. తిమ్మరుసును సలహా అడిగారు ఏంచేయాలని. ఆయనేమీ ఉపాయం చెప్పలేకపోయాడు. అప్పుడు రామకృష్ణుడికి కబురంపి “ఈ ఆహ్వానానికేం చేయాలో తోచక బెంగతో భోజనం కూడా సయించడం లేదు” అంటూ లేఖని చూపించారు. చదివి - “ఓస్‌! ఇంతేకదా?…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక

Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక   తెనాలి రామకృష్ణుడి కాలంలోనే - నెల్లూరు (అప్పుడు సింహపురం అనేవారు)లో ఒక వేశ్య ఉండేది. ఆమె సంస్కృతమూ, ఆంధ్రభాషా బాగా అభ్యసించడమే కాక అపరిమితమయిన దైవభక్తి కలిగి ఉండేది. ఎందరో పండితులను తన యింటికాహ్వానించి పురాణములు చెప్పించుకొనుచూ గోష్టులతోనూ తర్మవితర్మములతో కాలం గడుపుతూండేది. ప్రత్యక్షపురాణమంటే ఆమెకెంతో ప్రీతి. ప్రత్యక్షపురాణమంటే - కేవలమూ నోటితో పురాణం జెప్పడం కాకుండా ఆసన్నివేశాలలోని ప్రతిపాత్రా తానయి -నటనతో సహా - చేసి చూబిస్తూ పురాణం చెప్పడం. అలా అయితే ఆ సంఘటనలు కళ్లకి కట్టినట్లుంటాయని. ఎందరు పండితులు ఎంత చక్కగా చెప్పినా ఆ వేశ్యకు నచ్చలేదు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రభువయిన శ్రీకృష్ణదేవరాయల అనుమతి పొంది, రాజభటుల సహాయంతో నెల్లూరు చేరుకుని తన రాకను ఆమెకు తెలిపాడు. Tenali Ramakrishna Stories in Telugu, నల్ల కుక్క తెల్ల అవు (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అప్పటికే రామకృష్ణుని గురించి కొంత విని ఉన్న ఆ వేశ్య ఎంతో సంతోషంతో ఆ రాత్రే పురాణపఠనానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించి - రామకృష్ణునకు ఆహ్వానం ప…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక
  • 0