Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం

 

sri bhagavad gita telugu font pdf part 6 

 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.

హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.

 

పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రాజుపై కోపం వచ్చ…

Read more about Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu

సాంఖ్యయోగము (2 వ అధ్యాయం)   Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు.     కాని అర్జునుడు "నేను గురువులను,పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను.అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా.నాకు దుఃఖం ఆగడంలేదు.నేను నీ శిష్యుణ్ణి.నాకేది మంచిదో నీవే చెప్పు"అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు.అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు.తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని,వర్తమానం గురించికాని బాధపడరు.అయినా నేను,నువ్వు,ఈ రాజులు గతంలోనూ ఉన్నాము.భవిష్యత్తులోనూ ఉంటాము.బాల్యము,యవ్వనము,ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.సుఖదుఃఖాలు శాశ్వతం కావు.ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు. ఆత్మ లక్షణాలు దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం.ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు.ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము అనగా ఎ…
Read more about Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu
  • 0

Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

అర్జున విషాద యోగము  ఈ అధ్యాయం మొదటిది. Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి    బలాల, యోధుల గురించి పన్నిన, పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు. అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయో వృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరు మనవాళ్ళే, వారిలో కొందరు పుజ్యనీయులు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత నేను, నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి" …
Read more about Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

జ్ఞానయోగము (4 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది.     అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు.నీకు తెలియదు.నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను. ధర్మహాని - అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకొన్నవాడు,రాగ,ద్వేష,క్రోధ,భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను.మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను.నేను ఆకర్తను,అవ్యయుడను. నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు.ఇలా చేసేవారిని కూడా అం…
Read more about Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

కర్మయోగము  (3 వ అధ్యాయం)   Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు "   ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగానూ,యోగులకు కర్మయోగంగానూ చెప్పాను.కర్మలు(పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు.కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు.ఇంద్రియనిగ్రహం కలిగి,ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు. యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు.బ్రహ్మదేవుడు యజ్ఞాలవలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు. యజ్ఞాల ప్రాముఖ్యత యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు.యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు.కర్మల వలన యజ్ఞాలు,యజ్ఞం వలన వర్షం,వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి. పరమాత్మ వలన వేదాలు,వాటి వలన కర్మలు సంభవించాయి.ఈ కర…
Read more about Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము) Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: కర్మలను వదిలివేయమని ఒకసారీ,కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు.వీటిలో ఏది అనుసరించాలో చెప్పు? కృష్ణుడు:   కర్మత్యాగం,నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం.రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాలనుండి తరిస్తారు.     జ్ఞానయోగం,కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది.రెండూ ఒకటే అనే భావం కలిగిఉండాలి. యోగియై సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్దమనస్కుడు, ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా,వినినా,తాకినా,వాసన చూసినా,నిద్రించినా,శ్వాసించినా,మాట్లాడుతున్నా - ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీచేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక,ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు. యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు…
Read more about Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8 అర్జునుడు:     కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.   భగవానుడు:   నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.   మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.   ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.   వేదవేత్తలు,నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప…
Read more about Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8
  • 0

Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional

విజ్ఞానయోగము(7 వ అధ్యాయము) Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional కృష్ణుడు:   నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను. వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ది, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు. దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది. నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే. (adsbygoogle = window.ad…
Read more about Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional
  • 0

Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

భక్తి యోగము(12 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?    కృష్ణుడు: నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ…
Read more about Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

విభూతి యోగము(10 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu కృష్ణుడు: నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను. నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు.ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం.నాకు మొదలుచివరా లేవు.సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు. అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి. సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు. నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు. నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు. నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.   అర్జునుడు: నువ్వు శాశ్వతుడని,పరమాత్ముడనీ, ఆది అనీ ఋషులు, వ్యాసుడు అందరూ, నువ్వూ అంటున్నారు.నేనూ నమ్ముతున్నాను. నిన్…
Read more about Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0